: సమైక్య ఉద్యమంలో ఇది ఆఖరి పోరాటం: అశోక్ బాబు
సమైక్య ఉద్యమంలో ఇది ఆఖరిపోరాటం అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, రేపు సమావేశానికి ఏఏ పార్టీలు వస్తాయో, అసెంబ్లీలో ఏం చెబుతాయో చూస్తామని అన్నారు. తమ పోరాటానికి అన్ని పార్టీలు మద్దతివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రేపటి సమావేశానికి సమైక్యానికి మద్దతిచ్చే అన్ని పార్టీలను ఆహ్వానించామని అన్నారు.
తెలంగాణ ఉద్యమం వల్ల ఎలా ఒత్తిడి పెరిగిందో... తాము కూడా అలాగే ఒత్తిడి పెంచుతామని అశోక్ బాబు వివరించారు. కాంగ్రెస్ ఎంపీలు సొంత పార్టీపైనే అవిశ్వాస తీర్మానం పెట్టడం చరిత్రాత్మకం అని కొనియాడారు. పార్టీలన్నీ తమలో ఉన్న రాజకీయ విభేదాలు పక్కన పెట్టి సమైక్యానికి కృషి చేయాలని ఆయన సూచించారు. ఉద్యోగుల విషయంలో ఐఆర్ అమలు చేయాలని తాము కోరుతున్నామని అన్నారు.