: మా రుణాలను మాఫీ చేయరూ.. !: సీఎంకు నేతన్నల వినతి
సుమారు రూ.10 కోట్ల మేర రుణాలను మాఫీ చేయాలని ముఖ్యమంత్రికి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల చేనేత కార్మికులు వినతి పత్రం అందించారు. వారు సీఎంని క్యాంపు కార్యాలయంలో ఈరోజు కలిశారు. చేనేత కార్మికుల వెంట సిరిసిల్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. తమ సమస్యలపై స్పందించాలని విజ్ఞప్తి చేశారు. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరారు.