: దేవయాని విషయంలో పరిష్కారం కనుగొంటాం: సల్మాన్ ఖుర్షీద్
భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే వ్యవహారంలో పరిష్కారం కనుగొంటామని భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికా, భారత్ మధ్య సంబంధాలను కాపాడుకోవడం కూడా చాలా ప్రధానమని చెప్పారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో పెట్టుకొని వ్యవహరించాల్సి ఉందని ఖుర్షీద్ తెలిపారు. అయితే, దేవయానిపై అభియోగాలు ఉపసంహరించుకోబోమన్న అమెరికా ప్రకటనపై స్పందించేందుకు మాత్రం ఖుర్షీద్ నిరాకరించడం గమనార్హం.