: కుళ్లు రాజకీయాలలో ఇమడలేకపోయా: శారద


లోక్ సభ సభ్యురాలిగా సేవలందించినా... ఈ కుళ్లు రాజకీయాలలో ఇమడలేకపోయానని ప్రముఖ నటి శారద చెప్పారు. నటిగా ప్రేక్షకులందరినీ మెప్పించగలిగాను కానీ, రాజకీయాలలో మాత్రం రాణించలేకపోయానని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లకు విచ్చేసిన ఆమె విలేకరులతో మాట్లాడారు. నటనకు స్వస్తి చెప్పిన తాను ప్రస్తుతం చెన్నైలో ఉంటున్నానని చెప్పారు. నటీనటులకు రిటైర్మెంట్ లేదని... మంచి పాత్రలొస్తే మళ్లీ నటిస్తానని శారద చెప్పారు. ప్రస్తుతం సినిమా రంగం విలువలు కోల్పోయిందని... అర్థంపర్థం లేని డైలాగులు, ఛండాలమైన డాన్సులు సినిమాలంటేనే విరక్తి కలిగేలా చేస్తున్నాయని చెప్పారు. కుటుంబ సభ్యులందరూ కలసి సినిమా చూసే రోజులు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News