: అసెంబ్లీకి రెండు కిలోమీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు


బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో నిషేధాజ్ఞలు విధించారు. రాష్ట్ర శాసన సభ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీకి రెండు కిలోమీటర్ల పరిధిలో ధర్నాలు, ఊరేగింపులు నిర్వహించరాదని నగర కమిషనర్ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. అసెంబ్లీ పరిసరాల్లో సీసీ కెమెరాల సంఖ్య పెంచారు.  

ఈ సమావేశాల కోసం 16 మంది డీఎస్పీలు, 40 మంది ఎస్సైల ఆధ్వర్యంలో ఎస్పీఎఫ్ సిబ్బంది భద్రత విధులు నిర్వర్తించనున్నారు. కాగా, అసెంబ్లీ సమావేశాల సందర్బంగా శాంతి భద్రతల ఏర్పాట్లపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు.  

  • Loading...

More Telugu News