: ముస్లిం యూనివర్శిటీని వెంటనే మూసివేయండి: గర్జించిన స్వామీజీలు


సాక్షాత్తూ కలియుగ శ్రీనివాసుడు కొలువుతీరిన తిరుపతి, తిరుమల పవిత్రతను కాపాడే లక్ష్యంతో హిందూగర్జన సభ తిరుపతిలో ప్రారంభమైంది. ఈ సభకు దేశం నలుమూలల నుంచి స్వామీజీలు అసంఖ్యాకంగా తరలివచ్చారు. తిరుమల, తిరుపతి పరిసరాల పరిరక్షణ కోసం హిందూ జనజాగృతి సంస్థతో పాటు, వివిధ పీఠాలు సంయుక్తంగా ఈ సభను నిర్వహిస్తున్నాయి.

తిరుపతిలో అక్రమంగా నిర్మించిన హీరా ముస్లిం యూనివర్శిటీని శాశ్వతంగా మూసివేయాలని ఈ సందర్భంగా స్వామీజీలు డిమాండ్ చేశారు. హిందూ మతానికి సంబంధించి అత్యంత కీలకమైన తిరుపతిలో... ముస్లిం యూనివర్శిటీని కట్టడమేమిటని నిలదీశారు. ఇస్లాం యూనివర్శిటీని మూసివేసేదాకా ఈ పోరాటం ఆగదని శారదా పీఠాధిపతి స్వరూపానంద హెచ్చరించారు. ఇంత పెద్ద బిల్డింగ్ ను గుట్టు చప్పుడు లేకుండా కడుతున్నా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. అక్రమంగా నిర్మించిన ఈ యూనివర్శిటీపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News