: ప్రియురాలిని కట్టేసి గుండుకొట్టిన ప్రియుడు


విశాఖ జిల్లాలో సహజీవనం చేస్తున్న ప్రియురాలిపై కక్షతో ఆమె ప్రియుడు కాళ్లు చేతులు బంధించి శిరోముండనం చేశాడు. కొయ్యూరు మండలం బంగారంపేట పంచాయతీలోని గుజ్జువానిపాలెంకి చెందిన లోవ దుర్గ, శరభన్నపాలెంకి చెందిన బాలకుమార్ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ శరభన్నపాలెంలో సహజీవనం చేస్తున్నారు. గత కొంత కాలంగా డబ్బులు తీసుకురమ్మని దుర్గను బాలకుమార్ తీవ్రంగా వేధిస్తున్నాడు. వేధింపులు తట్టుకోలేని దుర్గ జరుగుతున్న విషయాన్ని సర్పంచ్, పెద్దల దృష్టికి తీసుకెళ్లింది.

దీంతో వారు కౌన్సిలింగ్ చేసి అన్యోన్యంగా ఉండాలని చెప్పి పంపించారు. తనపై ఫిర్యాదు చేసిందన్న కక్ష మనసులో పెట్టుకున్న బాలకుమార్.. దుర్గను మరింత వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయంలో మరోసారి తీవ్రవాగ్వాదం చోటుచేసుకోవడంతో... దుర్గ కాళ్లు, చేతులు తాడుతో కట్టేసి బ్లేడుతో గుండుకొట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News