: బేగంపేట అమెరికన్ కాన్సులేట్ వద్ద టీడీపీ కార్యకర్తల ఆందోళన


భారత దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగడే పట్ల అమెరికా తీరుపై టీడీపీ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బేగంపేటలోని యూఎస్ కాన్సులేట్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు యత్నించారు. వెంటనే అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెదేపా శ్రేణులకు, పోలీసులకు తీవ్ర ఘర్షణ జరిగింది. అనంతరం పోలీసులు తలసానితో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News