: బాలికపై రెండు నెలలుగా ఐదుగురు కానిస్టేబుళ్ల అత్యాచారం
న్యాయం కోసం పిలిచింది. ఖాకీల చేతిలో ఘోర అన్యాయానికి గురైంది. చండీగఢ్ పట్టణంలోని ఖుద్దా లహోరా ప్రాంతం. తండ్రి, సోదరుడు కొట్లాడుకుంటున్నారు. గొడవ ఆపేందుకు పోలీసులకు సమాచారం అందించింది 17 ఏళ్ల బాలిక. కానిస్టేబుళ్లు రంగ ప్రవేశం చేశారు. సమస్యను పరిష్కరించారో లేదో గానీ, వారిలో ఒకడు ఆ బాలికకు ఎరవేశాడు. పెళ్లిచేసుకుంటానంటూ ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అతడి సహచర కానిస్టేబుళ్ల వంతు వచ్చింది. వారు కూడా బాలికపై నెలల తరబడి అత్యాచారం కొనసాగించారు. చివరికి బాలిక సోదరుడు మునిసిపల్ కౌన్సిలర్ సాయంతో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కీచక ఖాకీలు నలుగురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఐదోవాడి పేరు వెల్లడి కావాల్సి ఉంది. వీరిలో ఇద్దరిని అరెస్ట్ చేయగా.. మిగతావాళ్లు పరారీలో ఉన్నారు.