: జూబ్లీ బస్ స్టేషన్ లో పసికందు మృత దేహం
సికింద్రాబాద్ బస్ స్టేషన్ లో అమానుష ఘటన చోటుచేసుకుంది. బస్ స్టేషన్ లో ప్లాట్ ఫామ్ నెంబర్ 1 దగ్గర ఉన్న ఓ కర్రల సంచిని మొదట్లో ఎవరూ పట్టించుకోకున్నా... చివరకు అనుమానం వచ్చిన ప్రయాణికులు దాన్ని తెరిచిచూశారు. అంతే, ఒక్క సారిగా వారు షాక్ అయ్యారు. ఎందుకంటే, అందులో కేవలం రెండు రోజుల వయసున్న చిన్నారి మృతదేహం ఉంది. ఆడపిల్ల పుట్టిందని వదిలేసిపోయారా? లేక చనిపోయిన చిన్నారిని వదిలేశారా? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. శిశువు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మారేడ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.