: ఈ వయొలిన్‌ ఖరీదెక్కువే


ఒక వయొలిన్‌ వెల కోట్లు పలికింది. కానీ దాన్ని అమ్మాలనుకున్నవారు మాత్రం దాని విలువ తెలుసుకోలేకపోయారు. పదిహేడో శతాబ్దానికి చెందిన ఒక వయొలిన్‌ అంతర్జాతీయంగా పేరొందిన దక్షిణ కొరియా సంగీత విద్వాంసురాలు మిన్‌`జిన్‌`కిమ్‌ వద్ద ఉండేది. ఈ వయొలిన్‌ను ఆమెనుండి 2010లో దొంగిలించారు. కానీ ఆ దొంగలకు దాని విలువ తెలియలేదు.

మరోపక్క తన వద్దనున్న వయొలిన్‌ దొంగిలించినప్పటినుండీ మిన్‌ దానికోసం వెదుకుతున్నారు. మరోవైపు దొంగలు దాని విలువ తెలియకుండా కేవలం వంద పౌండ్లకు అంటే పదివేల రూపాయలకు దాన్ని అమ్మేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. పదిహేడవ శతాబ్దానికి చెందిన ఈ వయొలిన్‌ను ఇటలీకి చెందిన అంటోనియో స్ట్రాడివేరియస్‌ తయారుచేశారు. అలాంటి విలువైన ఈ వయొలిన్‌ను దొంగలనుండి స్వాధీనం చేసుకుని వేలంలో పెడితే అది ఏకంగా 14 కోట్ల ధర పలికిందట. తన వద్దనున్న వయొలిన్‌ విలువ తెలిసిన మిన్‌`జిన్‌`కిమ్‌ దాన్ని వేలంలో సొంతం చేసుకున్న వ్యక్తికి శుభాకాంక్షలు తెలుపుతూ అది ఒక నమ్మకమైన స్నేహితుడివంటిదని చెబుతున్నారు.

  • Loading...

More Telugu News