: ఆజ్మీర్ దర్గాను దర్శించుకున్న కత్రినా
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఈరోజు ఆజ్మీర్ దర్గాను దర్శించుకుంది. ఆమె నటించిన 'ధూమ్-3' చిత్రం రేపు విడుదలవుతున్న నేపథ్యంలో దర్గాను దర్శించుకున్నట్టు తెలిపింది. తాను నటించిన చిత్రం విడుదలకు ముందు దర్గాను దర్శించడం కత్రినాకు ఆనవాయతీగా వస్తోంది. తాను మొదటిసారిగా 2007 లో నటించిన 'నమస్తే లండన్' చిత్రం విడుదలకు ముందు కూడా దర్గాను సందర్శించింది.