: కష్టకాలంలో మహేష్ నాకు ధైర్యాన్నిచ్చారు: శ్రీకాంత్ అడ్డాల
'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేస్తుండగా తనకు ఓ ఇబ్బంది ఎదురైందని, ఆ సందర్భంలో తాను ఒంటరినైపోయానని.. అప్పుడు తనతో మాట్లాడి ధైర్యం చెప్పిన వ్యక్తి హీరో మహేష్ బాబు అని.. ఆయనను జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేనని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అన్నారు. ఓ అభిమానికి ఈ ఫంక్షన్ లో మాట్లాడే అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో తనక్కూడా అలాగే ఉందని ఆయన అన్నారు. సుకుమార్ తనకు గురువులాంటి వారని ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలని శ్రీకాంత్ అడ్డాల ఆకాంక్షించారు.