: నాన్న నాకేం చెప్పలేదు.. నేను గౌతమ్ కేమీ చెప్పలేదు: మహేష్ బాబు
తాను బాల నటుడిగా ఉన్నప్పుడు సెలవుల్లో నాన్నగారు సినిమా షూటింగ్ కి తీసుకెళ్లేవారని మహేష్ బాబు గుర్తు చేసుకున్నారు. అయితే, నాన్న గారు సినిమాలో ఎలా నటించాలో ఎప్పుడూ చెప్పలేదని.. అందుకే తాను ఫుల్ ఎంజాయ్ చేస్తూ నటించేవాడినని మహేష్ బాబు చెప్పారు. అలాగే ఇప్పుడు తాను గౌతమ్ కి ఏమీ చెప్పలేదని, తను కూడా సెలవుల్లో షూటింగ్ లో బాగా ఎంజాయ్ చేశాడని మహేష్ బాబు అన్నారు.