: నాకే కొత్తగా ఉంది.. రెండేళ్ల క్రితం సుకుమార్ కథ వినిపించారు: మహేష్ బాబు


సినిమా ఆడియో వేడుక అభిమానుల మధ్య, అభిమానులతో మొదటి సారి విడుదల చేయించడం ఆనందంగా ఉందన్న ప్రిన్స్ మహేష్ బాబు.. ఈ అనుభవం తనకు కొత్తగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రెండేళ్ల క్రితం తనకు సుకుమార్ అరగంట సేపు '1-నేనొక్కడినే' సినిమా కథ వినిపించారని ఆయన చెప్పారు. అయితే అరగంట తరువాత తాను చాలా ఉత్కంఠకు గురయ్యానని, అప్పటికప్పుడే ఈ సినిమా చేస్తున్నానని సుకుమార్ కి చెప్పానని ప్రిన్స్ అన్నారు. ఈ సినిమా కథ కొత్తగా ఉందన్న మహేష్ బాబు.. '1-నేనొక్కడినే' సినిమా ఆడియో వేడుక సందర్భంగా విశాఖపట్టణం నుంచి మొదటి పాట విడుదల చేసిన అభిమానికి సమాధానం చెప్పారు.

  • Loading...

More Telugu News