: నేతలే కాదు.. తేనీటి విక్రేతలూ అక్కడ వీఐపీలే..!


ముంబయిలో ఈ నెల 22వ తేదీ, ఆదివారం నాడు భారతీయ జనతాపార్టీ నేత నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరుగనున్న విషయం విదితమే. ఆ ర్యాలీలో పాల్గొనేందుకు పది వేల మంది తేనీటి విక్రేతలకు వీఐపీ పాసులు కేటాయించామని బీజేపీ నేత రాజ్ పురోహిత్ మీడియాతో చెప్పారు. ఇవాళ బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో మోడీ ర్యాలీకి సంబంధించి వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ర్యాలీలో పాల్గొనే పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ వీఐపీలు (టీ-విక్రేతలు).. వారు కూర్చున్న చోటికే వెళ్లి తేనీటిని అందిస్తారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News