: రిలీజుకు ముందే ఈ సినిమా చరిత్ర సృష్టించింది: కృష్ణ


'1-నేనొక్కడినే' సినిమా రిలీజుకు ముందే చరిత్ర సృష్టించిందని సూపర్ స్టార్ కృష్ణ అభిప్రాయపడ్డారు. తెలుగు సినీ చరిత్రలో '1-నేనొక్కడినే' రిలీజ్ కు ముందే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిందని అన్నారు. ఈ సినిమా కోసం మహేష్ ఏడాది కష్టపడ్డాడని కృష్ణ తెలిపారు. పాటలు చిన్న చిన్న ముక్కలు వింటూంటేనే ఉత్కంఠగా ఉందని, పూర్తిగా వింటే మరింత అద్భుతంగా ఉంటుందని కృష్ణ అన్నారు. మా వంశానికి మరో సూపర్ స్టార్ దొరికినట్టేనని మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ని ఉద్దేశించి కృష్ణ అన్నారు. దీంతో అభిమానులు కేరింతలు కొట్టారు.

  • Loading...

More Telugu News