: ఆమ్ ఆద్మీ పార్టీకి మరింత సమయం: షిండే


ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి మరింత సమయం ఇచ్చినట్టు కేంద్రహోం మంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. కేంద్ర హోంశాఖ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎంత సమయం పడుతుందన్న విషయంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను అడిగామని అన్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి మరికొంత సమయం ఇచ్చానని లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపారని షిండే వివరించారు. ఈ గడువు సోమవారంతో ముగియనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News