: కృష్ణాజిల్లా మండల కేంద్రాల్లో ‘మీ సేవ’ కేంద్రాల్లో ఆధార్ పత్రాల జారీ
ఇప్పటి వరకు ప్రభుత్వ ధృవీకరణ పత్రాలను జారీ చేస్తున్న కృష్ణాజిల్లాలోని ‘మీ సేవ’ కేంద్రాలకు ఇక నుంచి ఆధార్ పత్రాలను కూడా జారీ చేయాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. అందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు యంత్రాలు కూడా ఆయా కేంద్రాలకు దిగుమతి అయ్యాయి. ఆధార్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు, కార్డు కాపీల కోసం జిల్లాలోని విజయవాడ, నూజివీడు, ఉయ్యూరు, అవనిగడ్డ, మచిలీపట్నం, జగ్గయ్యపేటలోని మీ సేవ కేంద్రాల్లో ఆధార్ కార్డు పత్రాలను తీసుకోవచ్చు. ఇందుకోసం మండలానికి ఒక మీ-సేవా సెంటర్ కు పత్రాల జారీ బాధ్యతను అప్పగించామని అధికారులు తెలిపారు.