: '1-నేనొక్కడినే' సినిమా నాకు ప్రత్యేకం.. నేను చాలా కష్టపడ్డాను: చంద్రబోస్


'1-నేనొక్కడినే' సినిమా తనకు ప్రత్యేకమైనదని.. అందువల్ల ఈ సినిమాకి తాను చాలా కష్టపడ్డానని పాటల రచయిత చంద్రబోస్ తెలిపారు. సాధారణంగా తాను ప్రతి సినిమాకు ఒకటి రెండు రోజుల్లోనే పాటలు ఇచ్చేస్తానని, అలాంటిది '1-నేనొక్కడినే' సినిమాకు చాలా కష్టపడ్డానని అన్నారు. ఒక్కో పాట రాసేందుకు 15 నుంచి 20 రోజుల సమయం పట్టిందని చంద్రబోస్ అన్నారు. దేవీశ్రీ ప్రసాద్, సుకుమార్ అంటే తనకు చాలా ఇష్టమని, ఇంతవరకు తాను మహేస్ బాబు సినిమాలకు పెద్దగా పాటలు రాయలేదని, అందువల్ల ఈ సినిమాకు చాలా శ్రమపడ్డానని అన్నారు.

గతంలో మహేష్ బాబుతో పని చేయలేదన్న లోటును '1-నేనొక్కడినే' సినిమా ద్వారా భర్తీ చేసుకున్నానని చంద్రబోస్ వివరించారు. అదీ కాక తాను ఎందుకంత కష్టపడ్డానన్నది పాటలు విన్నాక మీరే చెబుతారని అన్నారు. 'టీజర్ చిన్నదే. సినిమా చాలా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన పాటలు ఒకెత్తు, హీరో పరిచయగీతం ఒక్కటీ ఒకెత్తు' అని చంద్రబోస్ అన్నారు.

  • Loading...

More Telugu News