: నాకేం భయం.. నేను మొండివాడిని: సీఎం కిరణ్
విమర్శలకు భయపడేంత పిరికివాడిని కాదని ముఖ్యమంత్రి కిరణ కుమార్ రెడ్డి అంటున్నారు. తాను మొండివాడినని చెప్పుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ రోజు రెవిన్యూ సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన సభలో మాట్లాడారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
2014 ఎన్నికల వరకు తమ ప్రభుత్వానికి ఢోకాలేదని ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ ఎంపీ కంటే తానే ఎక్కువసార్లు ఇక్కడికి వచ్చానని సీఎం ఈ సందర్బంగా ఉద్ఘాటించారు. కేసీఆర్.. ప్రజా వ్యతిరేక ఉద్యమాలకే మద్దతిస్తారని సిఎం పరోక్ష విమర్శలు చేశారు.