: హైదరాబాద్ చేరిన రాష్ట్రపతి.. ఘన స్వాగతం పలికిన గవర్నర్, సీఎం
భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి భారతీయ వాయుసేనకు చెందిన విమానంలో హైదరాబాద్ హకీంపేటలోని ఎయిర్ ఫోర్స్ అకాడమీకి ఆయన చేరుకున్నారు. హకీంపేటలో విమానం దిగిన రాష్ట్రపతికి రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం దామోదర, మండలి ఛైర్మన్ చక్రపాణి, మంత్రులు గీతారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ఈ నెల 31 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో బస చేస్తారు.