: అసెంబ్లీ ఆవరణలో టీ.టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసన
శాసనసభ సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగిన విషయం విదితమే. ఇవాళ సభను నిరవధికంగా వాయిదా వేయడంతో విపక్ష సభ్యులు నిరసనకు దిగారు. అసెంబ్లీ ఆవరణలోనే టీ.టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ సభ్యులు బైఠాయించారు. సభా సమావేశాలు సజావుగా సాగలేదని, బిల్లుపై చర్చ జరగకుండానే.. సమావేశాలను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేయడం సరికాదని వారు ఆందోళన చేస్తున్నారు.