: అత్యధిక సంపాదనాపరుడు బఫెటే.. రోజుకు 37 మిలియన్ డాలర్లు
అమెరికన్ వ్యాపార దిగ్గజం, ఇన్వెస్ట్ మెంట్ గురు వారెన్ బఫెట్ 2013లో అత్యధికంగా సంపాదించిన బిలియనీర్ గా నిలిచారు. ఈ అభినవ కుబేరుడి సంపద ఈ ఏడాది రోజుకి 37 మిలియన్ డాలర్ల చొప్పున పెరిగిందని వెల్త్ ఎక్స్ నివేదిక తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో 46.4 బిలియన్ డాలర్లుగా ఉన్న సంపద 12.7 బిలయన్ డాలర్లు పెరిగి 59.1 బిలియన్ డాలర్లకు చేరింది.
సంపద పెరుగుదలలో బఫెట్ టాప్ స్థానంలోనే ఉన్నా.. సంపదలో మాత్రం 72.6 బిలియన్ డాలర్లతో బిల్ గేట్స్ నెంబర్ వన్ గా కొనసాగుతున్నారు. తొలి రెండు స్థానాల్లో వీరిద్దరూ ఉండగా తరువాతి మూడు స్థానాల్లో కేసినో దిగ్గజం షెల్డన్ అడల్ సన్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజో, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఉన్నారు.