: కొత్త రాష్ట్రాలకు డిమాండ్లు వస్తున్నాయి: ప్రణబ్ ముఖర్జీ
కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు వివిధ ప్రాంతాల నుంచి డిమాండ్లు వస్తున్నాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఢిల్లీలో జరిగిన నిఘా వర్గాల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలందర్నీ ఒకే చోట కలిపి ఉంచడం సాధ్యం కాదని అన్నారు. అయితే, రాష్ట్రాల ఏర్పాటులో రాజకీయంగా, పరిపాలన పరంగా విజ్ఞతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న జనాభా, అవసరాల రీత్యా ప్రజల్లో విభజన వాదాలు పెరుగుతున్నాయన్నారు. భద్రతాదళాలు, పోలీసు వ్యవస్థ ఉగ్రవాదాన్ని తిప్పి కొట్టేలా నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.