: కార్లకూ 'బ్లాక్ బాక్స్'


ఎప్పుడైనా విమానప్రమాదాలు చోటు చేసుకున్నపుడు.. 'బ్లాక్ బాక్స్' అనే పదం వింటుంటాం. విమానం టేకాఫ్ తీసుకున్నప్పటి నుంచి అది ల్యాండయ్యేదాకా అన్ని వివరాలను ఈ బ్లాక్ బాక్స్ తనలో నిక్షిప్తం చేసుకుంటుంది. ఒకవేళ ఆ విమానం ప్రమాదానికి గురైతే.. అలాంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్పమైందో, అందుకు కారణమేంటో కూడా రికార్డు చేస్తుందీ బ్లాక్ బాక్స్.

ఇప్పుడీ బ్లాక్ బాక్స్ కార్లలోనూ అమర్చుతున్నారు. బ్రిటన్ లో ప్రయోగాత్మకంగా 1700 కార్లలో ఆ పరికరాన్ని అమర్చారట. ఈ నూతన బ్లాక్ బాక్స్..  కారులో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే వెంటనే యజమానికి సందేశం పంపిస్తుంది.

కారుకు ఏదైనా ప్రమాదం వాటిల్లితే దగ్గర్లోని పోలీస్ పెట్రోలింగ్ వాహనాలకు సమాచారం చేరవేస్తుంది. అగ్గిపెట్టె పరిమాణంలో ఉండే ఈ బ్లాక్ బాక్స్ ను కంప్యూటర్ వ్యవస్థతో అనుసంధానం చేస్తారు. ఇది జీపీఎస్ సాయంతో పనిచేస్తుంది. 

  • Loading...

More Telugu News