: హెచ్ఐ వీ వైరస్ ను మింగేసే ఎంజైమ్
హెచ్ఐవీ వైరస్ ను తొలగించే ఎంజైమ్ ను శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రాణాంతక ఎయిడ్స్ వ్యాధిని కలిగించే హెచ్ ఐవీ వైరస్ పై చికిత్సలో ఇది మంచి పురోగతికి దారితీయగలదని భావిస్తున్నారు. డ్రెస్ డన్ యూనివర్సిటీ పరిశోధకులు జన్యుమార్పిడి టెక్నిక్ ద్వారా ఈ ఎంజైమ్ ను రూపొందించారు. ఇది హెచ్ ఐవీ వైరస్ ను గుర్తించి 90 శాతం కచ్చితత్వంతో నిర్వీర్యం చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుకలపై జరిపిన పరిశోధనల్లో వీరు ఈ ఫలితాలను గుర్తించారు. వైరస్ ను తగ్గిస్తూ రక్తంలో అది ఎక్కువ కాలం ఉండకుండా ఈ ఎంజైమ్ చూస్తుందని ప్రొఫెసర్ జొయాచిమ్ తెలిపారు. మనుషులపై ఈ ఎంజైమ్ ప్రభావాన్ని ఇంకా పరీక్షించాల్సి ఉందన్నారు.