: అప్పులు పంచుతారు కానీ.. ఆదాయాన్ని పంచరా?: పయ్యావుల


కేంద్ర ప్రభుత్వం పంపిన టీబిల్లు ఓ తప్పుల తడక అని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆరోపించారు. రాష్ట్రంపై ఏ మాత్రం అవగాహన లేని కొంత మంది తయారు చేసిన బిల్లుపై చర్చించమంటే ఎలాగని ప్రశ్నించారు. బిల్లుపై చర్చించడానికి తాము కూడా సిద్ధంగానే ఉన్నామని.. కానీ బిల్లులో ఏ అంశంపై క్లారిటీ లేనప్పుడు, చర్చించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ఈ రోజు ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. విభజన తర్వాత తలసరి విధానంలో అప్పులను పంచుతామని అంటున్నారే కాని, ఆదాయాన్ని మాత్రం పంచమంటున్నారని... ఇదెక్కడ న్యాయమని ఎద్దేవాచేశారు.

  • Loading...

More Telugu News