: వైభవంగా శ్రీశైలం మల్లికార్జుని వార్షిక ఆరుద్రోత్సవం
ఈ రోజు శ్రీశైలం మల్లికార్జునస్వామివారి జన్మనక్షత్రం కావడంతో, ఈ పుణ్యక్షేత్రంలో స్వామివారి వార్షిక ఆరుద్రోత్సవం వైభవంగా జరిగింది. దీన్ని పురస్కరించుకుని మల్లన్నకు లింగోద్భవకాల రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి అన్నాభిషేకం, విశేష పుజాలు చేశారు. స్వామివారి ఉత్సవ మూర్తులను నందివాహనంపై ఆసీనం గావించి క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు.