: శాసనసభ్యుల చేతుల్లో క్యాలిఫ్లవర్లు!
శాసనసభ్యుల చేతుల్లో క్యాలిఫ్లవర్లు ఏంటి? అని అనుకుంటున్నారా.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నాని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలా వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నల్లటి దుస్తులు ధరించి సీఎం తీరును తెలియజేస్తూ చేతిలో క్యాలిఫ్లవర్లతో శాసనసభకు వచ్చారు.