: కుక్కల కోసం టీవీ చానల్


కుక్కలకూ మనసుంటుందని, వాటికీ కొంత ఆటవిడుపు, వినోదం కావాలని ఇజ్రాయెల్ లో ఓ కేబుల్ టీవీ సంస్థ గుర్తించినట్టుంది, ఇంకేం, వెంటనే వాటికోసం ఓ టీవీ చానల్ ఆరంభించింది. ఉద్యోగులు తాము ఆఫీసులకు వెళుతూ పెంపుడు కుక్కలను ఇంట్లో వదిలిపెట్టడంతో అవి ఒంటరితనంతో బోర్ ఫీలవుతాయని ఆ చానల్ యాజమాన్యం అంటోంది.

అలాంటి కుక్కల కాలక్షేపం కోసమే తమ చానల్ అని వారు తెలిపారు. ఈ చానల్ లో వచ్చే కార్యక్రమాలు కుక్కలకు ఆహ్లాదం కలిగించేలా ఉంటాయని సదరు చానల్ చెబుతోంది. పైగా ఆ కార్యక్రమాలను చూసిన శునకాలు సవ్యరీతిలో ప్రవర్తిస్తాయట. అందుకు కూడా హామీ ఇస్తున్నారు. కుక్కలకూ ఓ రోజొస్తుందంటే ఇదేనేమో..!.

  • Loading...

More Telugu News