: 25 ఏళ్లలో ఇంత దౌర్జన్యకర ఘటనలు జరగలేదు: నాగం


సభలో సీమాంధ్ర సమస్యలపై చర్చించకుండా, ఆ ప్రాంత నేతలు సభను అడ్డుకుంటున్నారని బీజేపీ నేత నాగం జనార్ధనరెడ్డి తెలిపారు. చర్చను కొనసాగిస్తే తాము కూడా సీమాంధ్ర సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతామని అన్నారు. సభను బలవంతంగా అడ్డుకోవడం అప్రజాస్వామికమని విమర్శించారు. ఇంత దౌర్జన్యకర ఘటనలను 25 ఏళ్లలో తానెప్పుడూ చూడలేదని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ నాగం ఈ వ్యాఖ్యలు చేశారు. సభను అడ్డుకోవడం ద్వారా సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఆ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News