: శాసనసభ ప్రారంభం ... గంటపాటు వాయిదా
శాసనసభ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. స్పీకర్ నాదెండ్ల మనోహర్ శాసనసభలోకి ప్రవేశించగానే ఇరుప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభను హోరెత్తించారు. ఆందోళనల మధ్య స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు.