: సెంచరీ చేసిన కోహ్లీ.. టీమిండియా 207/4
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో భారత బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డ టీమిండియాను కోహ్లీ అద్భుత బ్యాటింగ్ తో ఆదుకున్నాడు. పుజారా, రోహిత్, రహానేలతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పి సత్తా చాటాడు. సహచరులు వెనుదిరుగుతున్నా మొక్కవోని పట్టుదలతో ఆడుతూ కోహ్లీ శతకం సాధించాడు. దీంతో టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. క్రీజులో సెంచరీ హీరో విరాట్ కోహ్లీ(112), అజింక్యా రహానే(26) ఉన్నారు.