: మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ అరెస్ట్
చింతలపూడి మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత మద్దాల రాజేష్ ను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును అడ్డుకున్నారనే ఆరోపణలతో రాజేష్ పై కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ రోజు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కావూరి ఒత్తిళ్లకు లొంగిన పోలీసులు రాజేష్ ను అన్యాయంగా అరెస్ట్ చేశారని వైకాపా కార్యకర్తలు ఆరోపించారు. సమైక్యవాదులను కావూరి 'సన్నాసులారా, చేతకాని వెధవల్లారా' అన్నా పట్టించుకోలేదని వాపోయారు.