: సీబీఐ పిటిషన్ ను తోసిపుచ్చిన గవర్నర్
మహారాష్ట్రను కుదిపేసిన ఆదర్శ్ కుంభకోణానికి సంబంధించిన విచారణలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు ఊరట లభించింది. నేరపూరిత కుట్ర, మోసం ఆరోపణలపై చవాన్ ను విచారించడానికి, సెక్షన్ 197 కింద రాష్ట్ర గవర్నర్ శంకర్ నారాయణన్ ను సీబీఐ అనుమతి కోరింది. అయితే గవర్నర్ దీనిని తోసి పుచ్చారు. దీంతో ఆదర్శ్ సొసైటీ భూముల కుంభకోణంలో అశోక్ చవాన్ ను విచారించే అవకాశం లేదు.