: రెండో వికెట్ కోల్పోయిన భారత్
దక్షిణాఫ్రికాతో జొహానెస్ బర్గ్ లో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆదిలోనే తడబడుతోంది. సఫారీ సీమర్ల బంతులను ఎదుర్కోవడానికి టీమిండియా బ్యాట్స్ మెన్ అష్టకష్టాలు పడుతున్నారు. భారత్ స్కోరు 17 పరుగులు ఉన్నప్పుడు... ఓపెనర్ శిఖర్ ధావన్ 13 పరుగులు చేసి స్టెయిన్ బౌలింగ్ లో ఇమ్రాన్ తాహిర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ మురళీ విజయ్ ఆరు పరుగులకే మోర్కెల్ బౌలింగ్ లో డీవిలియర్స్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం పుజారా, కోహ్లి క్రీజులో ఉన్నారు.