: తీర్మానానికి పట్టుబడితే వాయిదావేశారు: మైసూరారెడ్డి
లోక్ సభలో ఆర్టికల్-3 సవరణపై చర్చ జరగాలని తాము వాయిదా తీర్మానం ఇచ్చామని వైఎస్సార్ కాంగ్రెస్ నేత మైసూరారెడ్డి తెలిపారు. దీనికి తోడు, లోక్ పాల్ బిల్లుకు మద్దతిస్తూ తాము స్పీకర్ మీరాకుమార్ కు లేఖ ఇచ్చామని చెప్పారు. లోక్ పాల్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత, అవిశ్వాస తీర్మానానికి తాము పట్టుబట్టామని... కానీ, స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారని తెలిపారు. ప్రభుత్వానికి సమస్యలపై చర్చించే చిత్తశుద్ధి లేదని మైసూరా విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తోందని ఆరోపించారు.