: హైకోర్టులో మంత్రి పొన్నాలకు ఊరట
రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు హైకోర్టులో ఊరట లభించింది. పొన్నాల ఎన్నిక చెల్లదంటూ... ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వేసిన పిటిషన్ ను హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది. 2009 ఎన్నికల్లో 236 ఓట్ల మెజారిటీతో పొన్నాల విజయం సాధించారు. అయితే, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని, ఓడిపోయిన పొన్నాలను గెలుపొందినట్టు ప్రకటించారని ప్రతాప్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన కోర్టు అప్పుడు జరిగిన ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది.