: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
సౌత్ ఆఫ్రికాతో జొహానెస్ బర్గ్ లో ప్రారంభమైన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మురళీ విజయ్, ధావన్ భారత ఇన్నింగ్స్ ను ప్రారంభించనున్నారు. తుది జట్టులోకి జహీర్ ఖాన్ వచ్చాడు. ఈ మ్యాచ్ కు మరో ప్రత్యేకత ఉంది.. అదేంటంటే, టీం ఇండియా కెప్టెన్ ధోనీకి ఇది 50వ టెస్ట్ మ్యాచ్.