: ఈ ఏడాది గూగుల్లో ఎక్కువగా వెతికింది దేని కోసం?


నెల్సన్ మండేలా, పాల్ వాకర్, ఐఫోన్ 5ఎస్.. గూగుల్లో ఈ ఏడాది ఎక్కువ మంది సమాచారం కోసం అన్వేషించింది వీటి కోసమే. ఇటీవలే కన్నుమూసిన దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మొదటి స్థానంలో, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్ర నటుడు పాల్ వాకర్ రెండో స్థానంలో ఉన్నారు. ఈయన నవంబర్ 30న కారు ప్రమాదంలో మృతి చెందారు. మూడో స్థానంలో ఐఫోన్ 5ఎస్ ఉండగా, నాలుగో స్థానంలో కెనడా నటుడు కోరీమోంటీత్ నిలిచారు. డ్రగ్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల జూలైలో కోరీమోంటీత్ మరణించారు. ఆరో స్థానంలో బోస్టన్ బాంబు పేలుళ్లు, ఎనిమిదో స్థానంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్4, సోనీ గేమింగ్ పరికరం ప్లేస్టేషన్-4 తొమ్మిదో స్థానంలో నిలిచాయి.

  • Loading...

More Telugu News