: గడ్డం తీసేస్తే మోడీ బావుంటారు: నటి చిత్రాంగద సింగ్
క్లీన్ షేవ్ (నున్నటి గడ్డం) కార్యక్రమానికి మద్దతుగా గుజరాత్ సీఎం నరేంద్రమోడీ గడ్డం తీసివేయాలని నటి చిత్రాంగద సింగ్ అన్నారు. మోడీ క్లీన్ షేవ్ కోసం ప్రయత్నించాలని, అలా చేస్తే ఆయన బావుంటారు అంటూ బెంగళూరులో జిల్లెట్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు. ప్రధాని మన్మోహన్ సింగ్, మోడీ లాంటి గడ్డం ఉన్నవారు ఆకర్షణీయంగా కనిపించరా? అని విలేకరులు ప్రశ్నించగా.. గడ్డం తీసేస్తే మరింత బావుంటారని చెప్పింది. గడ్డం ఉన్న అభిమాన నటుడు ఎవరని అడగ్గా.. రజనీకాంత్ అని చెప్పింది. ఎలా అయినా సరే ఆయన చూడ్డానికి బాగా కన్పిస్తారని అభిప్రాయపడింది.