: ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం: కోమటిరెడ్డి


ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో కలిసిపోతుందని టీకాంగ్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకపోతే దళితుడినే తెలంగాణ ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ షరతు పెట్టారని తెలిపారు. కాంగ్రెస్ లో తమకు దళితుడైన దామోదర రాజనర్సింహ ఉన్నారని అన్నారు. ఈ రోజు అసెంబ్లీ లాబీలో కోమటిరెడ్డి మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఆజ్ఞల మేరకే సీఎం కిరణ్ నడుచుకుంటున్నారని... కాకపోతే సమైక్యవాదిననే ముద్ర వేయించుకోవడానికి ఆయన డబుల్ గేమ్ ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. అధిష్ఠానాన్ని కిరణ్ వ్యతిరేకించి ఉంటే, ఇప్పటికే ఆయన చంచల్ గూడ జైల్లో ఉండేవారని అన్నారు.

  • Loading...

More Telugu News