: వైఎస్సార్ కు 2009లో గాలి జనార్దన్ 500 కోట్ల సాయం: పయ్యావుల
2009 ఎన్నికల సమయంలో మైనింగ్ డాన్ గాలి జనార్దన్ రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డికి ఇచ్చిన రూ. 500కోట్ల నిధుల సాయంపై ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. నాడు వెఎస్ రాజశేఖరరెడ్డికి 500 కోట్ల రూపాయల సాయంతో పాటు, అనంతపురం జిల్లా కాంగ్రెస్ అభ్యర్థుల ఎన్నికల ఖర్చు మొత్తం తానే భరించానని స్వయంగా జనార్దన్ రెడ్డే సీబీఐ విచారణలో వెల్లడించారని పయ్యావుల చెప్పారు.
ఇందుకు నిదర్శనంగా కన్నడ పత్రిక విజయవాణిలో వచ్చిన కథనాన్ని ఆయన చూపారు. ఈ మేరకు గాలి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం కొన్ని రోజులలో కోర్టు ముందుకు వస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రక్షాళన కోసమే ఈ విషయాన్ని వెలుగులోకి తెస్తున్నామని చెప్పారు. ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదని, టీడీపీ, బీజేపీ ఏ పార్టీకి గాలి సాయం చేసినా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని పయ్యావుల చెప్పారు.

- Loading...
More Telugu News
- Loading...