: చర్చ మొదలవలేదని సీఎం నాటకాలాడుతున్నారు: ఎర్రబెల్లి
తెలంగాణ బిల్లు మాసాయిదాపై సోమవారమే చర్చ మొదలైందని... కానీ, సీఎం కిరణ్ తో పాటు సీమాంధ్ర ప్రాంత నేతలు ఇంకా చర్చ మొదలవలేదంటూ తొండి నాటకాలాడుతున్నారని టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. క్లాజులపై చర్చించేందుకు సీమాంధ్ర ఎమ్మెల్యేలు ఎక్కువ సమయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని... అవసరమైతే తాము తక్కువ సమయం తీసుకుంటామని అన్నారు. వీలైనంత త్వరగా బిల్లుపై ఏకగ్రీవ ఆమోదాన్ని తెలిపి, రాష్ట్రపతికి పంపాలన్నదే తమ ఉద్దేశ్యమని చెప్పారు. ఈ ప్రక్రియ సజావుగా పూర్తికావడానికి సీమాంధ్ర ఎమ్మెల్యేలు సహకరించాలని కోరారు.