: సీమాంధ్ర సమస్యలపై 40 రోజులు చర్చిద్దాం: ఈటెల రాజేందర్
సీమాంధ్ర నేతలకు నిజంగా వారి ప్రాంత ప్రజలపై ప్రేమ ఉంటే, వారి సమస్యలపై 40 రోజుల పాటు చర్చిద్దామని టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఈటెల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బిల్లు ముసాయిదాపై సవరణలు చేసే అధికారం కానీ, ఓటింగ్ కోరే అవకాశం కాని సభ్యులకు లేదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కేవలం బిల్లులోని క్లాజులపై చర్చించి, అభిప్రాయాలను తెలిపే అవకాశం మాత్రమే సభ్యులకు ఉందని చెప్పారు. సభను సజావుగా సాగనివ్వాలని, అడ్డుకునే ప్రయత్నం చేయరాదని ఆయన సీమాంధ్ర నేతలను కోరారు.