: సమైక్యాంధ్రను కాంక్షిస్తూ గుంటూరులో రైతుల ట్రాక్టర్ ర్యాలీ
సమైక్యాంధ్ర రాష్ట్రం కోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమని టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టిన తీరును నిరసిస్తూ, సమైక్యాంద్ర రాష్ట్రానికి మద్దతుగా ఆయన ఆధ్వర్యంలో గుంటూరులో ఇవాళ రైతుల ట్రాక్టర్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో సుమారు 400 ట్రాక్టర్లతో రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల అభీష్టాన్ని పట్టించుకోకుండా విభజన ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోవడం ఖాయమని ఆయన చెప్పారు.