: నాగార్జున యూనివర్సిటీలో లైంగిక వేధింపుల కలకలం
గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. ఇంజనీరింగ్ విద్యార్ధిని పట్ల అసిస్టెంట్ ప్రోఫెసర్ అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు రావడంతో విద్యార్థులు వీసీ ఛాంబర్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.