: అన్ని స్థానాల్లో అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపుతాం: కిషన్ రెడ్డి
భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తుకు ఎందుకు సిద్ధమయ్యిందో చెప్పాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి బీజేపీ ఇప్పటి వరకు ఏ పార్టీతో చర్చలు జరపలేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 42 లోక్ సభ, 294 శాసనసభ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని, ఆ మేరకు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం జరిగే రాష్ట్ర స్థాయి సమావేశంలో పార్టీ సీనియర్ నేతలతో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకొంటామని కిషన్ రెడ్డి వెల్లడించారు.