: 20 మంది మహిళలను హత్య చేసిన సీరియల్ కిల్లర్ దోషిగా నిర్థారణ
కర్ణాటకలోని మంగుళూరులో మోహన్ కుమార్ అనే వ్యక్తి మహిళలకు ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి తీసుకువచ్చి, నిర్బంధించి, అత్యాచారం చేసేవాడు. తర్వాత గర్భనిరోధక మాత్ర అని చెప్పి సైనైడ్ మాత్ర వాళ్ళ చేత మింగించి హత్యలకు పాల్పడేవాడు. అలా ఇరవై మంది మహిళలను హత్యచేసి 'సైనైడ్ మోహన్'గా పేరొందాడు. ఆ సీరియల్ కిల్లర్ మోహన్ కుమార్ ను మంగుళూరులోని సెషన్స్ కోర్టు దోషిగా నిర్థారించింది.
అనిత అనే మహిళ హత్య కేసు విచారణ సందర్భంగా మోహన్ చేసిన 20 నేరాలు వెలుగుచూశాయి. ప్రాసిక్యూషన్ ఆరోపించిన హత్య, అత్యాచారం, అమాయకులపై విషప్రయోగం, దొంగతనం, సాక్ష్యాల నిర్మూలన, వ్యక్తుల అపహరణ, నిర్బంధం, మోసం, ఫోర్జరీ తదితర నేరాలన్నింటిలోనూ అతను దోషి అని న్యాయస్థానం నిర్ధారించింది. కాగా ఈ సీరియల్ కిల్లర్ కు శిక్ష ఖరారు చేయాల్సి ఉంది.